హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల జంపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చెయ్యడంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. 

ఆ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే డి.సుధీర్ రెడ్డి ఖండించారు. తాను టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పార్టీ మారే ఛాన్సే లేదని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో గందరగోళం సృష్టించి తమవైపుకు తిప్పుకునేందుకు టీఆర్ఎస్ మైండ్ గేమ్ ఆడుతుందని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.