జూబ్లీహిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఓ కారు చేసిన బీభత్సంలో రెండున్నర నెలల పసికందు మృత్యువాత పడ్డాడు. రోడ్డు పక్కన బుడగలు అమ్ముకునే మహిళలు గాయాలపాలయ్యారు.
జూబ్లీహిల్స్ : హైదరాబాద్ లో ఇటీవల కారు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు తీస్తున్నాయి. అలా MLA sticker తో ఉన్న ఒక car గురువారం జూబ్లీహిల్స్ లో బీభత్సం సృష్టించింది. షాక్ కు గురిచేసింది. ఈ ఘటనలో రెండున్నర నెలల పసికందు మృతి చెందగా.. ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు womenలు గాయపడ్డారు. స్థానికులు, ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాదాపూర్ నుంచి టిఆర్ నెంబర్ తో ఉన్న వాహనం తీగల వంతెన మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లోని బ్రిడ్జిని దాటి , రోడ్డు నెంబర్ 1/45కూడలి వైపు వేగంగా వస్తోంది. ఈ క్రమంలో బ్రిడ్జి దిగగానే ఒక్కసారిగా అదుపుతప్పింది.
అక్కడే పిల్లలని ఎత్తుకుని బుడగలు విక్రయిస్తున్న మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన కాజల్ చౌహాన్, సారిక చౌహాన్, సుష్మ భోంస్లేలను కారు ఢీకొట్టింది. దీంతో కాజల్ చౌహాన్ చేతిలో ఉన్న రెండున్నర నెలల పసికందు రణవీర్ చౌహన్, సారిక చేతుల్లో ఉన్న ఏడాది వయసున్న అశ్వతోష్ సైతం కిందపడ్డారు. రణవీర్ చౌహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. మహిళలకు గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి వాహనాన్ని వదిలేసి రోడ్డు నెంబర్1 వైపు పరారయ్యాడు. స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు వారిని 108లో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. చిన్నారి రణవీర్ చౌహాన్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారు మీద బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ మహమ్మద్ పేరుతో స్టిక్కర్ ఉంది.
ఇదిలా ఉండగా, మార్చి 7న ఇలాంటి దారుణమైన ఘటనే హైదరాబాద్ లోనే చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని SR nagarలో ఓ Car బీభత్సం సృష్టించింది. ఈఎస్ఐ ఆస్పత్రి మార్గం నుంచి బీకే గూడ వైపుకు అతి వేగంగా వస్తున్న కారు చౌరస్తా వద్ద స్కూటీతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 8 నెలల పసికందు కూడా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, దీనికి రెండు రోజుల క్రితం Mulugu జిల్లా ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర road accident జరిగింది. ఆటోను ఢీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్గరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల్లో, స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను warangal MGMకు తరలించారు. మృతి చెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటోడ్రైవర్ జానీ(23)గా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
