Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్ తమిళిసైని కలిసిన రాజాసింగ్ సతీమణి..

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాభాయి ఆదివారం కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఉషాభాయి.. తన భర్త రాజాసింగ్‌పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు.

mla raja singh wife meets governor tamilisai soundararajan
Author
First Published Sep 18, 2022, 3:07 PM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాభాయి ఆదివారం కలిశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన ఉషాభాయి.. తన భర్త రాజాసింగ్‌పై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తన భర్త జైలు నుంచి విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఉషాభాయ్‌ లేఖను అందజేశారు.  

ఇక, ఉషాభాయి మాట్లాడుతూ.. హైదరాబాద్ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకుని నిరాధర ఆరోపణలతో కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఒత్తిడితో తన భర్తపై అనేకసార్లు కేసులు బుక్ చేసి ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. పోలీసులు ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన రాజాసింగ్ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే తన భర్తపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టి  వేధిస్తున్నారని.. రాజాసింగ్ భార్య న్యాయం చేయాలని కోరుతున్నారు. 

రాజా సింగ్ ఆగస్టు 22న విడుదల చేసిన వీడియోలో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నిరసనలు చెలరేగాయి. పోలీసులు మొదట రాజా సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినప్పటికీ.. రిమాండ్ ప్రక్రియలో లోపాలను పేర్కొంటూ నాంపల్లి కోర్టు అతన్ని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత రాజా సింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజా సింగ్ చర్లపల్లి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios