Asianet News TeluguAsianet News Telugu

రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్‌గూడకు తరలింపు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు.

mla raja singh sent to 14 days remand
Author
Hyderabad, First Published Aug 23, 2022, 6:16 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో చంచల్‌గూడ జైలు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అంతకుముందు నాంపల్లి కోర్ట్ బయట ఎంఐఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పోలీసులు ఆయనను నాంపల్లి కోర్ట్‌లో హాజరు పరిచారు. విషయం తెలుసుకున్న ఓ వర్గం యువకులు పెద్ద సంఖ్యలో కోర్ట్ వద్దకు చేరుకుని రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు రాజాసింగ్ మద్ధతుదారులు కూడా భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. 

ఇకపోతే.. ఇవాళ ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుండి బొల్లారం పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. మునావర్ ఫరూఖీ కామెడీ షో ను  నిర్వహించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ లో వీడియోను అప్ లోడ్ చేశారు. ఈ వీడియోలో ఓ వర్గాన్ని కించపర్చేలా ఉన్నాయని ఎంఐఎం నేతలు  సోమవారం నాడు ఆందోళన నిర్వహించారు.  మంగళవారం నాడు ఉదయం వరకు ఎంఐఎం శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపణలు చేసింది. దీంతో ఈ వీడియోను  తొలగించాలని యూట్యూబ్‌ను హైద్రాబాద్  పోలీసులు కోరారు..

Also REad:రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు:శాసనసభ పక్ష నేత పదవి నుండి తొలగింపు

పోలీసుల వినతి మేరకు ఈ వీడియోను యూట్యూబ్ తొలగించింది.ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నాయకత్వం కూడా రాజాసింగ్ పై చర్యలు తీసుకొంది. పార్టీ నియామావళికి వ్యతిరేకంగా వ్యవహరించినందున రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ నాయకత్వం,. 10 రోజుల్లో చర్యలు వివరణ ఇవ్వాలని కూడా  బీజేపీ నాయకత్వం కోరింది.  బీజేపీ నుండి సస్పెండ్ చేయడంతో పాటు బీజేపీ శాసనసభపక్ష నేత పదవి నుండి కూడా తప్పించింది పార్టీ.పలు పోలీస్ స్టేషన్లలో కూడా రాజాసింగ్ పై పిర్యాదులు అందాయి. డబీర్ పురా , మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో కూడా రాజాసింగ్ పై కేసులు నమోదయ్యాయి
 

Follow Us:
Download App:
  • android
  • ios