ఒక లారీ డ్రైవర్ కొడుకైన తనకు ఎమ్మెల్యేగా అవకాశమిచ్చిన కేసీఆర్ తనకు దేవుడితో సమానమన్నారు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ నరేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను నరేందర్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు.. కేసీఆర్ కి పాదాభివందనం చేసి మరీ అభినందనలు తెలిపారు. అనంతరం.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ కి నన్నపునేని నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు. 

పార్టీని మరింత బలోపేతం చేయడానికి కేటీఆర్ కృషి చేస్తారన్నారు. కేటీఆర్ న్యాయకత్వంలో పార్టీ ప్రజలకు మరింత చేరువ అవుతుందని అభిప్రాయపడ్డారు.