కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఎన్నో రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించందన్నారు. రాష్ట్రాల ప్రభుత్వాలను కులగొట్టే ఆనవాయితీని కాంగ్రెస్ నుంచి బీజేపీ కొనసాగిస్తోందని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఎన్నో రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించందన్నారు. 2018లో తమ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ వారి పార్టీలో చేర్చుకుందని టీ కాంగ్రెస్ నేతలకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈరోజు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సుధీర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరోజు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేటప్పుడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్‌కు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆ రోజు రాజీనామా లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు‌కు ఇచ్చి, గన్‌మెన్లను వదిలిపెట్టి గొప్ప త్యాగం చేసినట్టుగా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత 15 రోజులకే కొండగల్‌లో అధికార కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పాల్గొన్నారని విమర్శించారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరే సమయంలో రేవంత్ ముడుపులు ఏమైనా తీసుకుంటే.. తాము కూడా బీఆర్ఎస్‌లో చేరినప్పుడు తీసుకున్నట్టేనని అన్నారు. 

రాజస్థాన్ బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరలేదా... వారి శాసన సభా పక్షాన్ని విలీనం చేయలేదా అని ప్రశ్నించారు. గోవాలో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తే రేవంత్ రెడ్డికి తప్పుగా కనిపించడం లేదా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీజేపీ డైరెక్షన్‌లోనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని.. అలాంటి వ్యక్తి ఇవ్వాళ తమపై ఫిర్యాదు చేయడం విడ్డురంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ను మరింత బలహీనంగా మార్చి.. బీజేపీని బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి తీసుకున్నారని విమర్శించారు. కోర్టులో నడుస్తున్న కేసునే మళ్ళీ కొత్తగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని అన్నారు. షెడ్యూల్ 10 ప్రకారమే మేము ఆనాడు టీఆర్‌ఎస్‌లో విలీనం చేశామని చెప్పారు. 

టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడు రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకుంటే.. తాము తీసుకున్నట్లేనని అన్నారు. రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలకు సోనియా గాంధీ ముడుపులు ఇస్తే.. తమకు కూడా ఇచ్చినట్లే అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి గవర్నర్ పాలనను పెట్టింది నిజం కాదా? ప్రశ్నించారు. 

దేశంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ తోడో యాత్ర చేస్తున్నారని విమర్శించారు. బీజేపీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అయిందని విమర్శించారు. సీబీఐ, ఈడీని కోర్టు ద్వారా తమపై అక్రమ దాడులు చేయించే కుట్రలో భాగమే రేవంత్ ఫిర్యాదు అని విమర్శించారు. చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోని.. చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రాల ప్రభుత్వాలను కులగొట్టే ఆనవాయితీని కాంగ్రెస్ నుంచి బీజేపీ కొనసాగిస్తోందని విమర్శించారు. వెస్ట్ బెంగాల్ లో ప్రధాని మోదీ స్వయంగా బహిరంగ సభలో టీఎంసీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు వారితో టచ్ లో ఉన్నారని చెప్పింది దేశం మొత్తం విన్నారని చెప్పారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము ఆనాడు పార్టీ మారామని చెప్పారు. బీఆర్ఎస్‌లో చేరాం కాబట్టే అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు.