ఖమ్మం: ఓ కామాంధుడి చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురయిన ఓ మైనర్ బాలిక తాజాగా ప్రాణాలను కోల్పోయింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. 

కొద్దిరోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు  లైంగికదాడికి పాల్పడిన ఘటన బయటపడిన విషయం తెలిసిందే. ఈ లైంగిక దాడి కారణంగా తీవ్ర అస్వస్థతక గురయిన బాలికను కుటుంబసభ్యులు ఖమ్మం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే బాలిక ఆరోగ్యం మరింత క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. 

నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాలిక మృతిచెందింది. ఇప్పటికే బాలికపై అత్యాచారం జరగడంతో తీవ్ర బాధలో వున్న బాధిత కుటుంబానికి ఆమె మృతి మరింద వేదనను కలిగిస్తోంది. బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆమె మృతికి కారణమైన నిందితున్ని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.