ప్రేమ పేరుతో బాలిక వెంట పడ్డాడు. అతని మాయ మాటలు బాలిక నమ్మడంతో... అదును చూసుకొని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆత్మకూరు(ఎం)కు చెందిన దేవాసాని జంపన్న (20) కొంతకాలంగా ప్రేమపేరుతో అదే గ్రామానికి చెందిన ఓ బాలిక వెంటపడుతూ, మాయమాటలు చెప్పి చివరకు లైంగికదాడికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో బాధితురాలి తల్లి ఈ నెల 27వ తేదీన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు దేవసాని జంపన్నను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం భువనగిరి కోర్టులో హాజరు పరచారు. అక్కడి నుంచి నల్లగొండ జైలుకు తరలించినట్లు రామన్నపేట సీఐ ఏవీ రంగా విలేకరులకు తెలిపారు.