కనిపించకుండా పోయిన బాలుడి కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు.
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం జానంపేట లో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి... అనంతరం అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన లక్ష్మీ, విష్ణు దంపతులకు సంతోష్(8) అనే కుమారుడు ఉన్నాడు. మూడు రోజుల క్రితం సంతోష్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
కాగా.. కనిపించకుండా పోయిన బాలుడి కోసం కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో.. అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడి కోసం గాలించగా.. జానంపేట సమీపంలోని బావిలో బాలుడి మృత దేహాన్ని గుర్తించారు. సంతోష్ మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తమ బంధువులే చిన్నారిని చంపేశారంటూ బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
