శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.

మంత్రి ఈటల రాజేందర్ తోపాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని.. స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు.