పోతిరెడ్డిపాడు, ఆర్డీ‌ఎస్ వివాదం: ఆంధ్రోళ్లు ఎప్పటికీ అంతే.... మంత్రి వేముల సంచలన వ్యాఖ్యలు

కృష్ణానదీపై ప్రాజెక్ట్‌ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ జ‌ల దోపిడీని అడ్డుకొని తీరుతామ‌ని మంత్రి తేల్చిచెప్పారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టును ఏపీ కొన‌సాగిస్తే.. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రో యుద్ధానికి సిద్ధం కావాల‌ని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

minister vemula prashanth reddy sensational comments on ap cm ys jagan ksp

కృష్ణానదీపై ప్రాజెక్ట్‌ల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ జ‌ల దోపిడీని అడ్డుకొని తీరుతామ‌ని మంత్రి తేల్చిచెప్పారు. రాయ‌ల‌సీమ ప్రాజెక్టును ఏపీ కొన‌సాగిస్తే.. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రో యుద్ధానికి సిద్ధం కావాల‌ని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలోని దివిటిప‌ల్లిలో నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మంత్రి వేముల ఈ విధంగా వ్యాఖ్యానించారు. 

ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు అని మండిపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు నుండి 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారని... పోతిరెడ్డిపాడు జల దోపిడీపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేస్తే అప్పటి కాంగ్రెస్ మంత్రి డీకే అరుణ వైయస్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నప్పుడు హారతులు పట్టారని అని మండిపడ్డారు.

Also Read:దౌర్జన్యం చేస్తే ఊరుకోం: జగన్ కు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

ఎవ‌రైనా ఆంధ్ర‌వారు ఆంధ్రవారే అని క‌డిగిపారేశారు. వైఎస్ నీటి దొంగ అయితే ఆయన కొడుకు జగన్ గజ దొంగ అని విమ‌ర్శించారు. దొంగ‌త‌నంగా ప్రాజెక్టులు క‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాయ‌ల‌సీమ‌, ఆర్డీఎస్ కుడి కాల్వ ప‌నుల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని  వేముల డిమాండ్ చేశారు. లేని ప‌క్షంలో ప్ర‌జాయుద్ధం తప్పదని మంత్రి హెచ్చ‌రించారు. మీ హక్కు నీటిని మీరు తీసుకోండి.. మా హక్కు నీటిని తీసుకుంటే సహించేది లేదన్నారు. తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగితే కేసీఆర్ ఊరుకోరు అని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios