నిమ్స్ హాస్పిటల్ లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన భార్య నీరజా రెడ్డి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

"

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.  ప్రజలు వ్యాక్సిన్ పట్ల అపోహలు నమ్మొద్దన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.

మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ మనోహర్, సూపరిండెంట్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్,డాక్టర్ రమేష్  తదితరులు ఉన్నారు.