మొదలుకానున్న వానాకాలం.. హైదరాబాద్‌లో ఈసారి ముంపు ప్రభావం తక్కువే: మంత్రి తలసాని

రానున్న వర్షాకాలం నేఫథ్యంలో ఈసారి హైదరాబాద్ మహానగరంలో ముంపు ప్రభావం తక్కువేనని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పట్టణ ప్రగతి కార్యక్రమంపై తలసాని మంగళవారం సమీక్ష నిర్వహించారు. 
 

minister talasani srinivas yadav review meeting on pattana pragathi

వర్షాకాలం మొదలవ్వనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ (hyderabad) నగరంలోని ముంపు ప్రాంతాల వాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) స్పందించారు. గతంతో పోల్చితే ఈ ఏడాది హైదరాబాద్‌లో ముంపు ప్రభావం తగ్గుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మీలతో కలిసి పట్టణ ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులపైనే పట్టణ ప్రగతిలో ఎక్కువగా దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. 

మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు అందుకున్న తర్వాత హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా వున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరికిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

Also Read:మేం ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం.. దమ్ముంటే మీరు చేయండి, ఎన్నికల్లో చూసుకుందాం: బీజేపీ నేతలకు తలసాని సవాల్

ఇకపోతే.. హైదరాబాద్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం (hyderabad rain) పడుతోంది. వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో (shamshabad airport) ల్యాండింగ్ కావాల్సిన విమానాలను (flight diversion) అధికారులు దారి మళ్లిస్తున్నారు.  వాతావరణంలో మార్పుల వల్లే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాజమండ్రి - హైదరాబాద్, ఢిల్లీ- హైదరాబాద్ విమానాలు బెంగళూరుకు మళ్లించారు. అలాగే పాట్నా- హైదరాబాద్ విమానం విజయవాడకు మళ్లించారు. 

నగరంలోని మీర్‌పేట‌, బ‌డంగ్‌పేట్‌, బాలాపూర్, గుర్రంగూడ‌, ఎల్బీన‌గ‌ర్‌, సంగారెడ్డి, బీహెచ్ఈఎల్ , ఉస్మానియా యూనివ‌ర్సిటీ, రాంన‌గ‌ర్‌, ఉప్ప‌ల్, నాచారం ప‌రిధిలోనూ వ‌ర్షం కురిసింది. దీంతో ఉద‌యం నుంచి ఉక్క‌పోత‌కు గురైన ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. మరోవైపు అబ్ధుల్లాపూర్‌మెట్‌లోని కాటమయ్య ఆలయంపై పిడుగు పడింది. దీని ధాటికి ఆలయ గోపురం పై భాగం ధ్వంసమైంది. పిడుగుపడిన సమయంలో ఆలయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios