ఉజ్జయిని మహంకాళి  అమ్మవారి  బోనాల ఉత్సవంలో భాగంగా  ఫలహరం బండి ఊరేగింపు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్ చేశారు.

హైదరాబాద్: ఫలహారం బండి ఊరేగింపు లో తెలంగాణ మంత్రి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారంనాడు డ్యాన్స్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు ప్రారంభమైంది.

బోనాల ఉత్సవాలలో భాగంగా మొండా మార్కెట్ ఆదయ్య నగర్ కమాన్ నుండి ప్రారంభమైన ఫలహారం బండి ఊరేగింపు ప్రారంభమైంది. పోతురాజుల నృత్యాలు, కళాకారుల వివిధ వేశధారణలు, పాటలతో ఆదయ్య నగర్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హోంమంత్రి మహమూద్ అలీ, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు