తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దళిత బంధుపై అవాకులు చవాకులు మాట్లాడే వారంతా  మూర్ఖులేనని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. నగరాన్ని అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. 

ఎల్లుండి టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పార్టీ బలోపేతానికి బస్తీ నుంచి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చిస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలు వున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని .. దళిత బంధుపై అవాకులు చవాకులు మాట్లాడే వారంతా మూర్ఖులేనని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని.. నగరాన్ని అభివృద్ధి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తలసాని వెల్లడించారు.