గ్రేటర్ ఎన్నికలలో నాలుగు సీట్లు గెలవగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతు  కొత్త బిచ్చగాళ్ళు పొద్దెరగరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని BJP నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని ఆకుపాములలో మీడియా సమావేశంలో పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు, వరద ముంపుకు గురైన కుటుంబాలకు 25 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించకుంటే ప్రజలే బీజేపీ పై తిరగబడతారని హెచ్చరించారు.దేశం గర్వపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. 

కేవలం 2 ఎన్నికలలో గెలుపుకే బీజేపీ నాయకులు విర్రవీగుతున్నారని, టీఆర్ఎస్ ఇలాంటి అనేక ఎన్నికలను చూసిందన్న విషయాన్ని మరవొద్దని గుర్తుచేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు సేవ చేసేందుకే వినియోగించాలని, పదేపదే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తామంతున్నారు. మీకు ఆ ధైర్యం ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.