Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ ఎంసెట్ పలితాలు విడుదల: మొదటి మూడు ర్యాంకుల్లో ఏపీ విద్యార్ధులే

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం నాడు విడుదల చేశారు 

Minister Sabihta Indra Reddy Releases Telangana Eamcet Results
Author
Hyderabad, First Published Aug 12, 2022, 11:07 AM IST

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలను శుక్రవారం నాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.  తెలంగాణ ఎంసెట్ తో పాటు ఈసెట్ ఫలితాలను మంత్రి విడుదల చేశారు.తెలంగాణ ఎంసెట్ లో ఇంజనీరింగ్ విభాగంలో లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించారు. సెకండ్ ర్యాంక్  శ్రీకాకుళం జిల్లాకు చెందిన సాయి దీపిక  సాధిం,చారు.గుంటూరుకు చెందిన కార్తికేయ మూడో ర్యాంకు సాధించారు.ఇక అగ్రికల్చర్ విభాగంలో  గుంటూరుకు చెందిన నేహా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. విశాఖ జిల్లాకు చెందిన లోహిత్ సెకండ్ ర్యాంక్ దక్కించుకున్నారు. గుంటూరుకు చెందిన తరుణ్ మూడో ర్యాంక్ సాధించారు.తెలంగాణ ఎంసెట్ టాప్ ర్యాంకుల్లో ఏపీ విద్యార్ధుల హావా కొనసాగింది. అగ్రికల్చర్ ఫలితాల్లో మొదటి మూడు స్థానాల్లో ఏపీ విద్యార్ధులే నిలిచారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ లో 80.41 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ అగ్రికల్చర్ లో 88.34 శాతం ఉత్తీర్ణత సాధించారు.ఈ సెట్ లో 90.7 శాతం ఉత్తీర్ణత సాధించారుఈ సెట్ లో 90.69 శాతం ఉత్తీర్ణత సాధించారు.  19,953 మంది విద్యార్ధులు క్వాలిఫై అయ్యారు..

ఎంసెట్, ఈ సెట్ లలో  ర్యాంకులు సాధించిన విద్యార్దులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎంసెట్, ఈసెట్ పరీక్షల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కూడా  ఆమె ధన్యవాదాలు తెలిపారు. వర్షాలు పడుతున్న సమయంలో కూడా పరీక్షలను నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.1.72 లక్షల మంది ఎంసెట్ పరీక్షలు రాసేందుకు ధరఖాస్తులు చేసుకొన్నారని మంత్రి చెప్పారు., అయితే 1. 56 , 760 మంది పరీక్షలు రాశారని ఆమె గుర్తు చేశారు.త్వరలోనే ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ను ప్రారంభించనున్నట్టుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.  ఈ సెట్ కు సంబంధించి 24 వేల మంది ధరఖాస్తు చేసుకున్నారని మంత్రి చెప్పారు.  ఇందులో 22 వేల మంది పరీక్షలు రాశారన్నారు. పరీక్షలు రాసిన వారిలో 19 వేల 954 మంది క్వాలిఫై అయ్యారని మంత్రి వివరించారు. 

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ టాపర్లు

1.పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (హైద్రాబాద్)
2.నక్కా సాయి దీప్తిక(ఆముదాలవలస, శ్రీకాకుళం0
3.పొలిశెట్టి కార్తికేయ(తెనాలి, గుంటూరు)
4.జలజాక్షి( శ్రీకాకుళం)
5.హిమవంశీ(శ్రీకాకుళం)

ఎంసెట్ అగ్రికల్చర్ టాప్ ర్యాంకర్లు

1. జ్యోతూరు నేహా (గుంటూరు)
2.వి. రోహిత్( విశాఖపట్టణం)
3.కల్లం. తరుణ్ కుమార్ రెడ్డి(గుంటూరు)
4.కె. అంజన్(కూకట్ పల్లి)
5.జి, శ్రీరామ్(గుంటూరు)


 

Follow Us:
Download App:
  • android
  • ios