తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరిగి లో మంత్రి మహేందర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏం సాదించాలని బస్సు యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. మీ బస్సు యాత్రను ఎవరు నమ్ముతారని నిలదీశారు.

ఒకవైపు మీ కాంగ్రెస్ సీఎం లు, మంత్రులు కేసీఆర్ పథకాలను పొగుడుతున్నారు. మీరేమో విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో నాయకత్వం లేదన్నారు. జిల్లాకో సీఎం కాంగ్రెస్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు. గతంలో బుద్ది చెప్పిన తరహాలో ప్రజలు మరోసారి కాంగ్రెస్ కు బుద్దిచెబుతారన్నారు. మునిగే నావ లాంటిదే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.

రైతులు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వటం కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఊహించిందా అని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మాట నిలబెట్టుకోవటం ధైర్యంగా ముందుకు సాగటం సీఎం కేసీఆర్ కే సాధ్యం అన్నారు. పరిగి నియోజకవర్గంలో హరీశ్వర్ రెడ్డి హయంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం అవుతానని ఎంఎల్ఏ రాంమ్మోహన్ రెడ్డి కలగంటూ ప్రచారం చేసుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యే పై సెటైర్ వేశారు.