తెలంగాణ బతుకుకి అద్దంపట్టే పూల వేడుకే బతుకమ్మ పండగ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అన్నారు. అందుకే తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడబిడ్డలు ఆడిపాడి గౌరమ్మను, ప్రకృతిని ఆరాధిస్తారని అన్నారు. ఇలా ప్రకృతితో, శాస్త్రంతో, ఆత్మబంధువులతో ముడిపడి ఉన్న బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకులో భాగమైందన్నారు.
తెలంగాణ బతుకుకి అద్దంపట్టే పూల వేడుకే బతుకమ్మ పండగ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అన్నారు. అందుకే తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడబిడ్డలు ఆడిపాడి గౌరమ్మను, ప్రకృతిని ఆరాధిస్తారని అన్నారు. ఇలా ప్రకృతితో, శాస్త్రంతో, ఆత్మబంధువులతో ముడిపడి ఉన్న బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకులో భాగమైందన్నారు.
జడ్చర్లలో పలు మహిళా సంఘాలు బతుకమ్మ పండుగని నిర్వహించాయి. ఈ సందర్భంగా మంత్రి సతీమణి శ్వేత అక్కడి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా శ్వేతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ పల్లెల ప్రజల జీవన విధానానికి ఎంతో అనుసంధానం కలిగిన పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ప్రతి ఏడాది బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చి, ప్రకృతిని, పసుపుతో చేసిన గౌరమ్మను ఆరాధిస్తారన్నారు. ఇలా బతుకమ్మను ప్రకృతి పూలతో పేర్చి ఊరి చెరువుల్లో వేయడం వల్ల ఆ చెరువుల నీరు కూడా శుద్ధి అవుతుందన్నది సైన్స్ అన్నారు. ప్రకృతితో, శాస్త్రంతో, ఆత్మబంధువులతో ముడిపడి ఉన్న బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల బతుకులో భాగమైందన్నారు.
ఉద్యమ నేత కెసిఆర్ సిఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ పండుగని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ ఆడపడచులకు ఉచితంగా చీరలను ఇచ్చి బతుకమ్మని ఘనంగా నిర్వహించారన్నారు.అయితే కొన్ని పార్టీలు చీరలను తెలంగాణ మహిళలకు అందకుండా చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనేక పథకాలు రూపొందించి ఒంటరి మహిళలను ఆదుకుని, బీడీ కార్మిక మహిళలను, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మీ, స్కూల్ పిల్లలకు హైజనిక్ ఆరోగ్య కిట్లు, కెసిఆర్ కిట్లు, ఆడ పిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12వేలు ఇలా అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే అన్నారు. దేశంలో ఎక్కడా ఎప్పుడూ లేనన్ని పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ తప్ప మరే రాష్ట్రం లేదన్నారు. మహిళలంతా తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బాదేపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ శోభా గోవర్దన్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు నూకల శ్రీదేవి ఆయా సంఘాల ప్రతినిధులు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
వీడియో
"
