ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా అని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. కాగా.. రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రి 8గంటలకు వరకే విధులు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖాశర్మ స్పందించారు. రాత్రి 8గంటల్లోపు మహిళలు ఇంట్లో ఉండాలని సీఎం చెప్పడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
ట్విట్టర్ సీఎం నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆమె ట్వీట్ చేశారు. ఇంట్లో ఉంటే మహిళలపై నేరాలు జరగవా అని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయని చెప్పారు. కాగా.. రేఖాశర్మ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె మాటలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
కీలక స్థానాల్లో ఉన్నవారు తమకొచ్చిన సమాచారాన్ని పరిశీలించి.. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన రేఖాశర్మకు సూచించారు. సీఎం కేసీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడలేదని గుర్తు చేశారు.
Scroll to load tweet…
