కామన్ మ్యాన్‌లా కేటీఆర్: కారు ఆపేసీ సెల్పీలు

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 4, Sep 2018, 4:20 PM IST
minister ktR stops his convoy at traffic signal in king koti
Highlights

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  హైద్రాబాద్ కింగ్ కోఠీ చౌరస్తాలో మంగళవారం నాడు  ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన కాన్వాయ్ ను ఆపించారు.  కేటీఆర్ కాన్వాయ్  ఆగగానే  బెంగుళూరులో  టెక్కీగా పనిచేస్తున్న  వైష్ణవి కేటీఆర్ ను విష్ చేశారు. 


హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  హైద్రాబాద్ కింగ్ కోఠీ చౌరస్తాలో మంగళవారం నాడు  ట్రాఫిక్ సిగ్నల్ పడగానే తన కాన్వాయ్ ను ఆపించారు.  కేటీఆర్ కాన్వాయ్  ఆగగానే  బెంగుళూరులో  టెక్కీగా పనిచేస్తున్న  వైష్ణవి కేటీఆర్ ను విష్ చేశారు. మంత్రితో ఆమె సెల్పీ దిగారు.

మంగళవారం నాడు మధ్యాహ్నం మంత్రి కేటీఆర్  తన వాహనంలో వెళ్తుండగా కింగ్ కోఠి వద్దకు  కేటీఆర్ కాన్వాయ్ చేరుకోగానే  ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఈ సిగ్నల్  పడగానే మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను  ఆపించారు.

మంత్రి కాన్వాయ్‌  ఆగగానే  కేటీఆర్ ను చూసిన టెక్కీ వైష్ణవి  ఆయనను విష్ చేసింది.  మంత్రి కేటీఆర్ తో సెల్పీ దిగాలన్న కోరికను  వైష్ణవి వ్యక్తం చేసింది. దీంతో  వైష్ణవితో కేటీఆర్ సెల్పీ దిగాడు.  వైష్ణవి కేటీఆర్ తో సెల్పీ దిగగానే  పలువురు రోడ్డుపైనే కేటీఆర్ తో సెల్పీలు దిగారు.

సామాన్యుడి మాదిరిగా మంత్రి కేటీఆర్  తన కాన్వాయ్ ను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిపివేయడంతో  పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు. 

loader