Asianet News TeluguAsianet News Telugu

ప్రతి సోమవారం చేనేత దుస్తుల్నే ధరిస్తున్నాం: కేటీఆర్

నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగన్నారు

minister ktr speech in nalgonda
Author
Nalgonda, First Published Sep 23, 2019, 2:33 PM IST

నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే పరిమితమైన పండుగన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది ఆడపడుచులకు కేసీఆర్ బతుకమ్మ చీరలను ఇవ్వాలని నిర్ణయించుకున్నారని కేటీఆర్ వెల్లడించారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో స్కూల్ యూనిఫామ్‌లు, బతుకమ్మ చీరల తయారీని సైతం ప్రభుత్వం వారికే ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు.

భవిష్యత్తులో సింగరేణి, ఆర్టీసీ కార్మికుల యూనిఫామ్‌ల తయారీని నేతన్నలకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు నూలు, రసాయనాలు ఇతర ముడిసరకును 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయేనన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా టెక్స్‌టైల్స్, వీవర్స్ పార్కులను నిర్మిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ప్రతి సోమవారం చేనేత వస్త్రాలే ధరించాలని పిలుపునిచ్చి ఆచరిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు.

నల్గొండ, సూర్యాపేటలో మెడికల్ కళాశాల, భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించారని ఆయన తెలిపారు. యాదాద్రిని తిరుమల తిరుపతి దేవస్ధానానికి ధీటుగా నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios