Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, వైఎస్సారే పర్లేదు.. ఇప్పుడు బఫూన్‌ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోంది: కేటీఆర్

ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షా అప్ప‌నంగా కట్ట‌బెట్టిన కాంట్రాక్టుల‌పై కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

MInister KTR Slams BJP and Komatireddy rajgopal reddy
Author
First Published Oct 11, 2022, 3:08 PM IST

ఒక కాంట్రాక్టర్ అహంకారం వల్లనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్ర‌ధాని మోదీ, అమిత్ షా అప్ప‌నంగా కట్ట‌బెట్టిన కాంట్రాక్టుల‌పై కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రోజుకో మాట మాట్లాడుతున్నారని.. వాటిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను క‌ట్టెబెట్టిందని ఆరోపించారు. నల్గొండ  జిల్లా అభివృద్దికి రూ. 18 వేల కోట్ల ఇస్తే.. టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందని అన్నారు. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి చెప్పిన మాట‌ల‌కు టీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని..  పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా చెబుతున్నానని అన్నారు. 

‘‘కొట్లాడదాం అంటే ఇదివరకు ప్రత్యర్థులు మంచిగుండే.. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి వాళ్లతోని కొట్లాడిన గమ్మతుండే.. వాళ్లు ఒక స్థాయి కలిగిన నాయకులు.. వాళ్లతోని మాట అన్న, మాట పడ్డ ఒక పద్దతి ఉండే.. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అంటే పర్లేదు మనకు.. కొద్దిగా అనుతుండే’’ అని అన్నారు. ఇప్పుడు బఫూన్‌ గాళ్లతో మాట్లాడాల్సి వస్తోందన్నారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ బఫూన్‌ గాళ్లు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఊరు, పేరు అడ్రస్‌ లేని లవంగం గాళ్లు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఈడీ, బోడీలతో తమ వెంట్రుక కూడా పీకలేరని స్పష్టం చేశారు. నిజాయితీగా ఉన్నవాళ్లకు భయమెందుకని చెప్పారు. చావనైనా చస్తాం కాని బీజేపీపై పోరాటంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదన్నారు గోల్ మాల్ గుజరాత్ మోడల్ తమకు అవసరం లేదన్నారు. విజయవంతమైన తెలంగాణ మోడల్ ను  దేశానికి పరిచయం చేస్తామన్నారు.

మోదీపై ఆరోపణలు చేస్తున్నామని.. దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాలు చేయొద్దా అని ప్రశ్నించారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇతర ప్రాంతాల్లోనూ గులాబీ జెండా ఎగురవేస్తామని కేటీఆర్ తెలిపారు. ఒక వ్యక్తి ధనవంతుడు అయితే ఆ జిల్లా గానీ, నియోజకవర్గం గానీ బాగుపడదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios