ఎల్పీజీ సిలిండర్ ధర పెంపు : ‘బదాయి హో.. అచ్చేదిన్ ఆగయే..’.. కేంద్రంపై కేటీఆర్ సెటైర్లు...

‘మంచిరోజులొచ్చేశాయ్.. గ్యాస్ సిలిండర్ ధర పెంచి మహిళలకు మంచి కానుకిచ్చారు..’ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

minister ktr setairical tweet on lpg gas price hike

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ పై తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు కురిపించారు తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన బీజేపీ ప్రభుత్వంపై సంధించిన వ్యంగ్యాస్త్రాలు చర్చనీయాంశమయ్యాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం మీద ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. ‘అచ్చే దిన్  ఆగయే.. బదాయి హో .. మంచి రోజులు వచ్చేశాయి.. అందరికీ శుభాకాంక్షలు’...వంటగ్యాస్ ధరలను కేంద్రం మరోసారి పెంచేసింది. ప్రధాని మోడీ సిలిండర్ ధరను  పెంచి  గ్యాస్ వినియోగదారులకు, మహిళలకు మంచి కానుక ఇచ్చారు’ అంటూ సెటైరికల్ గా రాసుకొచ్చారు. 

ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు బుధవారం (జూలై 6)  దేశీయ చమురు సంస్థలు మరోసారి షాక్ ఇచ్చాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గ్యాస్ బండ రేటు రూ.1100 దాటేసింది. ఇక చమురు సంస్థల తాజా నిర్ణయంతో హైదరాబాద్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఇందులో భాగంగానే కేంద్రానికి మరోసారి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. 

కాగా, బుధవారం ఉదయం గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. చమురు సంస్థలు రూ.50  మేర పెంచాయి. దీంతో హైదరాబాదులో గ్యాస్ ధర రూ.1055  నుంచి రూ.1105కు చేరింది. సాధారణంగా ప్రతి నెల ఒకటవ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈనెల1న 19కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు రూ.183.50 మేర  తగ్గించాయి.  తాజాగా  గృహావసరాల గ్యాస్ ధరను పెంచాయి. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాల్టి నుంచి అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. 

ఇదిలా ఉండగా ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు జూలై 1న చమురు సంస్థలు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలను రూ.198  తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు నోటిఫికేషన్లో తెలిపారు. దేశంలోని ప్రముఖ మెట్రో నగరాల్లో కోల్కతాలో  ఎల్పిజి సిలిండర్ ధర రూ.182, ముంబైలో రూ.190.50 చెన్నైలో రూ.187  తగ్గింది.  పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి లభించలేదు. జూలై 1 వరకు  దీని ధర  మే 19న ఉన్న రేటుకే అందుబాటులో ఉంది.

గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు తర్వాత  ఈ చర్చ జరిగింది అంతకుముందు జూన్ 1న రూ.135  తగ్గించారు.  మరోవైపు డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల వినియోగదారులకు మే నెలలో కూడా రెండు సార్లు నిరాశ ఎదురైంది.  డొమెస్టిక్ సిలిండర్ల ధరను తొలిసారిగా మే 7న రూ.50  పెంచగా..  మే 19న డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ల ధరలు మరింత పెరిగాయి.  డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధర గత నెలలో ఢిల్లీలో రూ.1,003కి  పెరిగింది. అంటే ఒక నెల లో వరుసగా రెండవ పెరుగుదల.  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు ఎల్పీజీ ధరలు పెంచడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ లను ప్రేరేపించాయి. గత నెలలో, వంట గ్యాస్ ధరలు సిలిండర్కు రూ.53.50వరకు పెరిగాయి.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios