కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఈడీ, ఐటీ, సీబీఐ దాడుల గురించి ప్రస్తావించిన కేటీఆర్.. బీజేపీ వాళ్లంతా సత్య హరిశ్చంద్రుడి బంధువులా? అని ప్రశ్నించారు. 

కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ నేతలు, వారి మనుషులు, బంధువులపై ఎన్ని ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగాయని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లంతా సత్య హరిశ్చంద్రుడి బంధువులా?.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. #JustAsking అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశారు. కాగా, గతకొంతకాలంగా టీఆర్ఎస్‌తో సహా పలు విపక్ష పార్టీలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తిని దెబ్బతిస్తోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులను దెబ్బతీయడానికి బీజేపీ జేబు సంస్థగా మార్చుకుందని విమర్శలు చేస్తున్నాయి. 

గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నిధుల విషయంలో, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. ఇలా పలు విషయాలపై బీజేపీపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్‌పీఏ((పనికిరాని ఆస్తి- నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌) గ‌వ‌ర్న‌మెంట్‌లో భార‌త‌దేశ ఎకాన‌మీని నాశ‌న‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏళ్లలో అత్య‌ధికంగా నిరుద్యోగ రేటు పెంచార‌ని మండిప‌డ్డారు. అలాంటి వారు తెలంగాణ‌కు వ‌చ్చి మాకు నీతులు చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

Scroll to load tweet…