Asianet News TeluguAsianet News Telugu

ఎంగిలాకులు చింపుకుని రోడ్ల మీద పడి కొట్టుకుంటారు:కేటీఆర్ సెటైర్

మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్ఎస్ స్వీట్లు పంచుకుంటుందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో పర్యటిస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. 

Minister ktr satire on mahakutami
Author
Jagtial, First Published Oct 24, 2018, 4:54 PM IST

జగిత్యాల: మహాకూటమి సీట్లు పంచుకునేలోపు టీఆర్ఎస్ స్వీట్లు పంచుకుంటుందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో పర్యటిస్తున్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. ఒక ఆర్థిక వేత్త సమక్షంలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చిస్తే అసలు భాగోతం బయటపడుతుందని మండిపడ్డారు. 

మున్సిపాలిటీ శాఖ మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి జగిత్యాల మున్సిపాలిటీకి ఏం చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50కోట్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ దేనన్నారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులు నాలుగేళ్లలో తాము ఎక్కడ చేస్తామని ప్రశ్నించారు. 

కాంగ్రెస్ దిగిపోయేటప్పుడు తమకు అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఇచ్చిపోయారా అంటూ నిలదీశారు. ఇతర పార్టీలపై నిందాపూర్వకమైన ఆరోపణలు చేసే తాము ఏం చేశామో ఆలోచించుకోవాలని హితవు పలికారు. 

డిసెంబర్ లో ఏర్పడేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అందులో ఎలాంటి సందేహమే లేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని పిలిచి ఆయన సమక్షంలోనే జగిత్యాల మున్సిపాలిటీ రోడ్డు వైండింగ్ పనులు ప్రారంభిద్దామని తెలిపారు.  

మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి లేదని అసమ్మతి అంతకన్నా లేదన్నారు. కేవలం ఆశావాహులు మాత్రమే ఉన్నారన్నారు. ఒక్కసీటుపై నలుగురు అభ్యర్థులు పోటీపడటంలో తప్పు లేదుగా అని కేటీఆర్ ప్రశ్నించారు. కానీ ఆశావాదులు ఎలాంటి ఆందోళన చెందొద్దని సరైన సమయంలో సరైన నిర్ణయాలు తప్పక ఉంటాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేటీఆర్. తాము 90శాతం సీట్లు ప్రకటించామని ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకుపోతున్నామని తెలిపారు. 

ఇకపోతే మహాకూటమిపై సెటైర్లు వేశారు కేటీఆర్. మహాకూటమి సీట్లు పంచుకునే అంశంపై ఇంకా ఓ క్లారిటీకి రాలేదన్నారు. సీట్ల సర్దుబాటు అంటూ ఓ హోటల్ లోకి వెళ్లి ఛాయ్ తాగి వస్తున్నారే తప్ప సీట్లపై ప్రకటించడం లేదన్నారు. 

మహాకూటమిలో సీట్లు ప్రకటించిన తర్వాత అప్పుడు కథ స్టార్ట్ అవుతుందన్నారు. ఎంగిలాకులు చింపుకుని రోడ్లు మీద పడి కొట్టుకుంటారని విమర్శించారు. ఈ సీటు నాది ఆ సీటు నాదంటూ రోడ్డుపై పడి ఎలా కొట్టుకుంటారో చూడండంటూ సెటైర్ వేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios