రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న యురేనియం మైనింగ్ పై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. “నల్లమల అడవుల్లో యురేనియం మైనింగ్ విషయంలో మీరు ఏం చెప్పదల్చుకున్నారో, ఏం కోరుకుంటున్నారో నాకు తెలిసింది. ఈ మ్యాటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ తో వ్యక్తిగతంగా చర్చిస్తానని మీకు హామీ ఇస్తున్నా” అని కేటీఆర్ తన ట్వీట్ లో తెలిపారు.

కేటీఆర్ ట్వీట్ ను చాలామంది స్వాగతించారు. హరితహారం ప్రాజెక్టును చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… నల్లమల అడవులను దెబ్బతీస్తూ… ఎలక్ట్రిసిటీ కోసం యురేనియం తవ్వకాలు జరపడం కరెక్ట్ కాదని.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కాగా ఈ విషయంపై ఇప్పటికే చాలా పెద్ద వివాదమే నడుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందించారు. మరి దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.