Asianet News TeluguAsianet News Telugu

పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ .. బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం

కాంగ్రెస్ మాజీ నేత , మాజీ మంత్రి పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు. 

minister ktr reached ex minister ponnala lakshmaiah residence ksp
Author
First Published Oct 14, 2023, 2:29 PM IST

కాంగ్రెస్ మాజీ నేత , మాజీ మంత్రి పొన్నాల ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించనున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో వున్న పొన్నాల .. నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా తాను ఎదుర్కొన్న అవహేళనలను వివరించారు. అయితే పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి బీఆర్ఎస్ బరిలో దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది. 

కాంగ్రెస్ తరపున జనగామ టికెట్ ఆశించిన పొన్నాల లక్ష్మయ్య ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఇక్కడి నుంచి టికెట్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. సునీల్ కనుగోలు సర్వే సైతం కొమ్మూరి ప్రతాప్ రెడ్డే గెలుస్తారని తేలడంతో పొన్నాల తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. రాజీనామా ప్రకటన చేస్తూ మీడియా ముందు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios