KTR : సింగరేణి  విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు మంత్రి కేటీఆర్. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగార‌మ‌నీ, సింగరేణిని దెబ్బతీస్తే మోడీ స‌ర్కార్ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమ‌నీ కేంద్ర గనులశాఖ మంత్రికి కేటీఆర్‌ ఘాటు లేఖ రాశారు.  సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగార‌మ‌నీ, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమ‌నీ,  సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు  

KTR : సింగరేణి విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించారు మంత్రి కేటీఆర్. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగార‌మ‌నీ, సింగరేణిని దెబ్బతీస్తే మోడీ స‌ర్కార్ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమ‌నీ కేంద్ర గనులశాఖ మంత్రికి కేటీఆర్‌ ఘాటు లేఖ రాశారు. సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగార‌మ‌నీ, సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమ‌నీ, సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు 

వెంట‌నే తెలంగాణలోని నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారని, వేలం లేకుండా ఆ గ‌నులను సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో అభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని, ఈ త‌రుణంలో కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగా ఇలాంటి సంస్థను చంపే చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

 కేంద్ర మెడలు వంచిన రైతు పోరాటాన్ని మరిపించే మరో ఉద్యమానికి సింగరేణి కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టంచేశారు. సింగరేణి కాపాడుకునేందుకు మేము అన్ని విధాలుగా సింగరేణి బిడ్డలకు, కార్మికులకు అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6 , శ్రవనపల్లీ ఒసి, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా వాటికోసం వేలంలో పాల్గొనాలని నిర్దేశించడంపైన మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల బాటలో నడుస్తున్న సింగరేణి బలోపేతం చేసేందుకు అవసరమైన బొగ్గు గనులను కేటాయించాల్సింది పోయి... గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించి... ఆ మేరకు ముందుకు పోవడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఒక ఘాటైన లేఖ రాశారు.


తెలంగాణ ఏర్ప‌డిన‌ నాటి నుంచి సింగ‌రేణి లో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధించింద‌నీ, సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ధర్మల్ విద్యుత్ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పి ఎల్ ఎఫ్ ను కలిగి ఉందని కేటీఆర్ అన్నారు. కేవలం సింగరేణి రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర తోపాటు పలు దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తుంద‌ని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటాను ఇస్తున్న ఎకైక సంస్ధ సింగరేణేన‌నీ కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు కార్మికుల కోసం ఏ ప్రభుత్వరంగ సంస్ధ చేయనన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలను సింగరేణి చేపట్టిందన్నారు మంత్రి కేటీఆర్. 

 ప్రగతిపథంలో న‌డుస్తున్న‌ సింగరేణిని బలహీనపరిచి, ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పక్క రాష్ట్రం అంద్రప్రదేశ్ లోనూ ఇదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందని కేటీఆర్ మండిప‌డ్డారు. 

కేంద్రం దగ్గర ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కు చెందిన 27 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇలాంటి కుట్రలనే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింగరేణిపై చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు గుజరాత్ లో మాత్రం లిగ్నైట్ గనులను ఏలాంటి వేలం లేకుండా నేరుగా గుజరాత్ మినరల్ డెవలప్ మెంట్ సంస్ధకు కేటాయించార‌నీ, తెలంగాణలోని సింగరేణికి ఎందుకు ఇవ్వరని కేటీఆర్ నిల‌దీశారు. బీజేపీ పాలన రాష్ట్రాల‌కో రూల్.. ఇత‌ర రాష్ట్రాల‌కో రూల్ ఉందని విమ‌ర్శించారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ట్రం కాదా? అని ప్రశ్నించారు. ఇదీ కేవలం సింగరేణి సంస్ధపై మాత్రమే వివక్ష కాదని, యావ‌త్తు తెలంగాణపై వివక్ష అని మండిపడ్డారు. కేంద్రం కుట్రలను తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారని, ఈ కుట్రలను ఆపకుంటే తగిన బుద్ది చెబుతారన్నారు మంత్రి కేటీఆర్.

మా దృష్టిలో కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. ఈ వేలంవెర్రి ఆలోచనలు ఇప్పటికైనా మానుకోకపోతే, ఎన్నో విరోచిత పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్ గా నిలిచిన సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కుపిడికిళ్లు బిగించడం ఖాయమని, కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం తథ్యమని హెచ్చరించారు మంత్రి కేటీఆర్.