KTR : "కేసీఆర్‌తో సవాల్‌ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే.."

KTR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కొడంగల్‌ లో పోటీ చేయకపోతే.. తానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తానని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి బహిరంగ ప్రకటన  చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

Minister KTR meet BRS Party Cadre Meeting At Kamareddy constituency KRJ

KTR: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం రసవత్తరంగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్ళతో రాజకీయం మరింత వీడెక్కుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొడంగల్‌కు రాకపోతే తానే  కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తానని టిపిసిసీ రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. 

కాంగ్రెస్ నియోజకవర్గంలోని బిక్నూర్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్ పై పోటీ చేయడమంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సవాల్ చేయడం సరైనా పద్ధతి కాదన్నారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులపైకి తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నేడు కామారెడ్డికి వచ్చి కేసీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉండని అన్నారు. సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో పోటీ చేస్తనని ప్రకటించడంతో ప్రతిపక్షాలకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయ్యానీ, అందుకే ఏదోటి మాట్లాడుతూ ..కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణం ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ అని, తన ప్రాంతానికి తాను కొంత చేశానని, కానీ తన కోరిక నెరవేరాలంటే.. కామారెడ్డి నియోజకవర్గానికి గోదావరి నీళ్లు తీసుకురావాలన్నారు. తన కోరిక నేరవేరాలంటే.. సీఎం కేసీఆర్ తో మాత్రమే సాధ్యమనీ, అందుకే కేసీఆర్ ను కామారెడ్డికి వచ్చి పోటీ చేయాలని గంపా గోవర్ధన్ కోరారని తెలిపారు. గంపా గోవర్థన్ కోరికను కూడా కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. నవంబర్ 9న కేసీఆర్ నామినేషన్ దాఖలు చేస్తారని అన్నారు. ఆ రోజు జరిగే భారీ బహిరంగ సభకు ఇంటికి ఒక్కరు చొప్పున కేసీఆర్‌ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 

కామారెడ్డికి కేసీఆర్ రావడమంటే.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చినట్టు అన్నారు.  కేసీఆర్ వస్తే కామారెడ్డి దశ తిరుగుతుందని, ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇస్తారనే విశ్వాసం తనకు ఉందని అన్నారు. గతంలో పలుమార్లు గంపా గోవర్ధన్ చేతిలో షబ్బీర్ అలీ ఓడిపోయారనీ, ఇప్పుడు కేసీఆర్ స్వయంగా పోటీ చేస్తానంటే.. ఆయనకు భయం పట్టుకుందనీ, అందుకే షబ్బీర్ అలీ నిజామాబాదుకో.. ఎల్లారెడ్డికో వెళ్లిపోవాలని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్, బీజేపీ ఇచ్చే పిప్పరమెంట్లు, చాక్లెట్లు తిందామా? కేసీఆర్‌ను గెలిపించుకొని దమ్ బిర్యానీ.. పంచభక్ష్య పరమాన్నం తిందామా? ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్షాలు డబ్బులు ఇస్తే తీసుకొని, ఓటు మాత్రం బీఆర్ఎస్‌కు వేయాలన్నారు. ఎన్నికల్లో ఎవరి ప్రలోభాలకు లొంగిపోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇచ్చే పిప్పర్‌ మెంట్లకు, బిస్కెట్లకు ఆశపడవద్దనీ, కామారెడ్డిలో కేసీఆర్‌ ను గెలిపించుకుంటే.. ధమ్ బిర్యానీ,  పంచభక్ష్య పరమాన్నాలు తిన్న వచ్చని అన్నారు.

ప్రతిపక్షాలు ఓటు కోసం ఏమిచ్చినా తీసుకోవాలని, ఎందుకంటే.. అవన్నీ మనల్ని ముంచి ఎత్తుకెళ్లిన గుజరాత్‌ దొంగ పైసలని అనీ, వారు ఏమి ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కు ఓటు వేయాలని అన్నారు. మోసాన్ని మోసంతోటే జయించాలనీ, ముల్లుముల్లుతోటే తియ్యాలని  హితవు పలికారు మంత్రి కేటీఆర్‌. ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరని అన్నారు. రాహుల్ గాంధీ అసలు లీడర్ కాదని, ఆయన ఇతరులు రాసి ఇచ్చేది చదివే రీడర్  అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios