Asianet News TeluguAsianet News Telugu

ఓఆర్ఆర్‌ వెంబడి సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన..

హైదరాబాద్ ఓఆర్ఆర్‌ వెంబడి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు నానక్ రామ్‌గూడ వద్ద కేటీఆర్ భూమి పూజ చేశారు.

Minister KTR Laid Foundation stone for Solar roof topped cycling track along the ORR
Author
First Published Sep 6, 2022, 3:16 PM IST

హైదరాబాద్ ఓఆర్ఆర్‌ వెంబడి సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌కు మంత్రి కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశారు. సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటుకు నానక్ రామ్‌గూడ వద్ద కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పర్యావరణ హితంగా ఉండే ప్రజా ఉపయోగకరమైన నాన్ మోటరైజ్ట్ ట్రాన్స్ పోర్టు సొల్యూషన్ను ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఇది మొట్టమొదటి సోలార్ రూఫ్ సైకిలింగ్ ట్రాక్ అని చెప్పారు.

ఐటీ ఉద్యోగులు.. ఆఫీస్‌లకు సైకిల్పై రాకపోకలు సాగించేందుకు, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కోసం సైతం సైక్లింగ్ బాగుంటుందన్నారు. కోవిడ్ తర్వాత అందరిలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెరిగిందన్నారు. దుబాయ్, జర్మనీ, పారిస్.. లాంటి ఇతర దేశాల్లో ప్రత్యేకంగా అధ్యయనం చేసి సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. డెమో కింద 50 మీటర్లు తయారు చేశామన్నారు.  సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా చెప్పారు. రానున్న వేసవిలోగానే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. 

అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లందరికీ.. 24 గంటలు ఈ ట్రాక్‌ అందుబాటులో ఉంటుందన్నారు. సీసీటీవీ కెమెరాల సర్వేలైన్స్‌తో పాటు  ఫుడ్ కోర్టులు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు.. అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు. 

 

 ఇక, ఫస్ట్ ఫేజ్‌లో మొత్తం 23 కిలోమీటర్ల మేర 4.5 మీటర్ల వెడల్పుతో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. 16 మెగా వాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా సోలార్ రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు. నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు 14.5 కిలోమీటర్ల వరకు సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం జరుగనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios