Asianet News TeluguAsianet News Telugu

దమ్ముంటే ఆ పని చేయండి.. ముందస్తు ఎన్నికలపై బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాలు..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు. 

Minister KTR key comments On Assembly elections
Author
First Published Jan 28, 2023, 2:14 PM IST

తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన సిద్దంగా ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్  నుంచే తిరుగులేని సమాధానం ఇవ్వాలని.. అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బీఆర్ఎస్ గెలువాలని అన్నారు. రాబోయే ఏడు నుంచి తొమ్మది నెలల పాటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్విరామంగా పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాట్లాడతారని.. వాళ్లకు దమ్ముంటే పార్లమెంట్‌ రద్దు చేసి రావాలని సవాలు విసిరారు. అలా చేస్తే ముందస్తుకు అందరం కలిసి పోదాం అంటూ కామెంట్ చేశారు.

తెలంగాణలో అర్థవంతమైన పాలన జరుగుతోందని కేటీఆర్ అన్నారు. అభివృద్ది విషయంలో రాజీపడేది లేదని చెప్పారు. దేశంలో మత విద్వేషాలు  పెంచడం తప్ప.. బీజేపీ చేసిందేమి లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తులను పరిశీలించాలని కోరారు. రైతుబంధు తరహాలో రూ. 5 వేలు దేశం మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు విద్యా సంస్థలు, రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులకు జాతీయ ప్రాజెక్టు హోదాఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఇక, నిజామాబాద్ పర్యటనలో భాగంగా స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను ప్రారంభం, ఇందూరు కళాభారతికి శంకుస్థాపన చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios