Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్‌ పెద్దమనసు.. పేదింటి విద్యార్థిని చదువుకి ఆర్థిక సాయం, వరుసగా మూడో ఏడాది

వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించారు. ఆమె కుటుంబ నేపథ్యం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. గడిచిన రెండేళ్లేగా ఫీజులను ఆయనే స్వయంగా కడుతున్నారు. తాజాగా మరోసారి ఆర్ధిక సాయాన్ని అందించారు.
 

minister ktr helps student from warangal
Author
Hyderabad, First Published Aug 25, 2021, 8:07 PM IST

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేద విద్యార్ధిని చదువుకు కావాల్సిన ఆర్ధిక సాయాన్ని మంత్రి అందించారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన విద్యార్థిని మేకల అంజలి రెండేళ్ల క్రితం ఐఐటీలో సీటు సాధించారు. పేదరికం, ఆర్థిక సమస్యల కారణంగా చదువును కొనసాగించేందుకు ఇబ్బంది పడుతున్నానని, ఆర్థిక సాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ని ఆమె గతంలో అభ్యర్థించారు.

విద్యార్ధిని కుటుంబ పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్ వ్యక్తిగతంగా గత రెండేళ్లుగా అంజలి ఫీజులకు అవసరమైన ఆర్ధిక సాయం చేశారు. ఈ ఏడాదికి, రానున్న సంవత్సరానికి సంబంధించిన ఫీజు మొత్తాన్ని ఇవాళ ప్రగతిభవన్‌లో అంజలి కుటుంబానికి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా అంజలి చదువు, భవిష్యత్ ప్రణాళికల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఆమె తన చదువు దిగ్విజయంగా పూర్తి చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు. తమ కుమార్తె చదువుకు ఆర్థిక సాయాన్ని అందించడం పట్ల అంజలి కుటుంబం కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios