Asianet News TeluguAsianet News Telugu

మాట నిలబెట్టుకున్న మంత్రి కేటీఆర్

 మంత్రి ఆదేశాల మేరకు షేక్ నఫీస్ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, 10 లక్షల రూపాయలను జాయింట్ అకౌంట్ లో జమ చేయడం ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేశారు.

minister KTR helps hanicaped painter
Author
Hyderabad, First Published Sep 4, 2018, 11:00 AM IST

మంత్రి కేటీ రామారావు దివ్యాంగురాలు అయిన యువ పెయింటర్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.  గత నెల ప్రథమార్థంలో రవీంద్రభారతిలో మల్కాజ్గిరి కి చెందిన  దివ్యాంగురాలు షేక్ నఫీస్ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను మంత్రి కేటీ రామారావు సందర్శించారు. మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆమె, అద్భుతమైన తన చిత్రకళా ను కొనసాగిస్తుండడం మంత్రి అభినందించి, అన్ని విధాల ఆదుకుంటామని  ఆ సందర్భంగా హామీ ఇచ్చారు. 

ఈ మేరకు యువ చిత్రకారినికి జీవితాంతం పెన్షన్ వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పెన్షన్ తో పాటు ఆమెకి అవసరమైన పూర్తి వైద్య సహాయాన్ని నిమ్స్ ఆస్పత్రిలో కల్పిస్తామని హామీ ఇచ్చారు.  మంత్రి ఆదేశాల మేరకు షేక్ నఫీస్ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం, 10 లక్షల రూపాయలను జాయింట్ అకౌంట్ లో జమ చేయడం ద్వారా నెలకు పదివేల రూపాయల పెన్షన్ వచ్చే ఏర్పాటు చేశారు.

 ఈ పెన్షన్ సౌకర్యం నఫీజ్ జీవితాంతం ఉంటుందని ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ అధికారులు మంత్రి కేటీ రామారావు కి తెలియజేశారు.  ఈ విషయంలో సత్వరం స్పందించి న సాంస్కృతిక శాఖ మంత్రి చందు గారికి కృతజ్ఞతలు తెలపడంతోపాటు, భాషా సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వేంకటేశం, డైరెక్టర్ మామిడి హరికృష్ణ కు మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios