త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తున్న టీఆర్ఎస్.. దీనిపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. 

తెలంగాణ భవన్‌లో బుధవారం జరిగిన ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఒక్కో జిల్లాకు ఇంఛార్జ్‌లు ముగ్గురు మంత్రుల్ని కేటీఆర్ నియమించారు. నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేదే పూర్తి బాధ్యతని ఆయన తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్‌ని కలవాలని నేతలకు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు బీజేపీ చేసిందేమి లేదని ఆరోపించారు.. ఐటీఐఆర్‌ను కూడా బీజేపీ రద్దు చేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. పీవీ వాణి మంచి విద్యావేత్త అన్న కేటీఆర్.. ఉద్యోగాల కల్పనలో టీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని తెలిపారు.

హోంగార్డులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, ఇతరులకు జీతాలు పెంచామన్నారు. చిరు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేటీఆర్ తెలిపారు. పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని మంత్రి ప్రశ్నించారు. పన్ను రూపంలో కేంద్రం రూపాయి తీసుకుని పది పైసలు నిధులు ఇస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.