బండి సంజయ్ ఓ కార్టూన్ క్యారెక్టర్ అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. శనివారం ఓ మీడియా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ.. ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్‌ను చాలా చూశామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఇలాంటి కార్టూన్ క్యారెక్టర్స్ చాలా ఉండేవని ఆయన ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని కేటీఆర్ గుర్తుచేశారు.

Also Read:కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది, మధ్యంతర ఎన్నికలు తప్పవు: బండి సంజయ్

ఎన్నికలు లేనప్పుడు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ని పొగిడి వెళ్లారని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తిట్టి పోతారని కేటీఆర్ మండిపడ్డారు.

కాగా, భోలక్‌పూర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుంది.

మధ్యంతర ఎన్నికలు తప్పవు. కేసీఆర్‌పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు. ఆయన జైలుకు పోవటం ఖాయం. అంటూ సంచలన కామెంట్స్ చేసిన విషయం విదితమే.