హైదరాబాద్: ఆంధ్రా ఆక్టోపస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విడుదల చేసిన సర్వేపై టీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. లగడపాటివి సర్వేలు కాదని చిలక జోస్యాలు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సనత్ నగర్ లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ లగడపాటి సర్వేపై మండిపడ్డారు.

సర్వేలపేరుతో లగడపాటి తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చెయ్యాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లగడపాటి, చంద్రబాబులు ఇద్దరూ పొలిటికల్ టూరిస్ట్ లు అని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంటే డిసెంబర్ 11న తట్టా బుట్టా పట్టుకుని ఆంధ్రాకు పోవాల్సిందేనన్నారు. 
    

ఈ వార్తలు కూడా చదవండి

లగడపాటివి సర్వేలు కాదు, చిలక జోస్యం: కేటీఆర్ కౌంటర్