Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ వల్లే ఉత్తమ్ కు టిపిసిసి పదవి : సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కామెంట్

టిపిసిసి అధ్యక్ష పదవి ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించాడు. ఆ పదవి రావడానికి కేసీఆర్, తెలంగాణ ప్రజలే కారణమని ఆయన మర్చిపోయినట్లున్నారని...అందుకోసమే మరోసారి గుర్తు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నపుడు తెలంగాణ కు ప్రత్యేక పిసిసి ఉండాలంటే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. దీన్ని డిమాండ్ చేసిన తెలంగాణ నాయకులను గంజిలో ఈగ మాదిరి తీసిపారేసేవారని అన్నారు. అలాంటిది కేసీఆర్ పోరాటం పుణ్యాన తెలంగాణ రావడంతో ప్రత్యేకంగా టిపిసిసి (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)  ఏర్పడిందని అన్నారు. ఆ పిసిసికి ఉత్తమ్ అధ్యక్షుడైన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై రోజూ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డాడు.

minister ktr comments on uttamkumar reddy
Author
Sircilla, First Published Sep 22, 2018, 5:01 PM IST

టిపిసిసి అధ్యక్ష పదవి ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగిరెగిరి పడుతున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించాడు. ఆ పదవి రావడానికి కేసీఆర్, తెలంగాణ ప్రజలే కారణమని ఆయన మర్చిపోయినట్లున్నారని...అందుకోసమే మరోసారి గుర్తు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నపుడు తెలంగాణ కు ప్రత్యేక పిసిసి ఉండాలంటే ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. దీన్ని డిమాండ్ చేసిన తెలంగాణ నాయకులను గంజిలో ఈగ మాదిరి తీసిపారేసేవారని అన్నారు. అలాంటిది కేసీఆర్ పోరాటం పుణ్యాన తెలంగాణ రావడంతో ప్రత్యేకంగా టిపిసిసి (తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ)  ఏర్పడిందని అన్నారు. ఆ పిసిసికి ఉత్తమ్ అధ్యక్షుడైన కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై రోజూ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను  పోటీచేసే సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ...కాంగ్రెస్ పార్టీ, నాయకులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఊళ్లలో ఇంకా  ఏం ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు తిరుగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని...మహాకూటమికి పది సీట్లు కూడా రావని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  

ఇటీవల గులాం నబీ అజాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ప్రగల్బాలు పలికాడని తెలిపాడు. కానీ టీఆర్ఎస్, కేసీఆర్ అనే మూడక్షరాలు లేకుంటే 300 ఏళ్లయినా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని స్పష్టం చేశాడు. తెలంగాణలోని ప్రతి నీటిబొట్టులో, కరెంటు తీగల్లో, పేదవాడి ముఖంలో, ఆసరా పెన్షన్లలో కేసీఆర్ కనబడతాడని కేటీఆర్ చమత్కరించారు.  

 కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న హామీలన్ని నెరవేర్చాలంటే దక్షిణ భారతంలోని అన్ని బడ్జెట్లు సరిపోవని అన్నారు. అలాంటి హామీలను కాంగ్రెస్ పార్టీ ఎందుకిస్తుందో తెలియాలంటే ఈ చిన్న కథ గురించి తెలుసుకోవాలంటే కేటీఆర్ ఓ టైలర్ రథ చెప్పాడు. దీంతో సభిలో నవ్వులు విరిసాయి.  ఇక టిటిడిపి అధ్యక్షుడు రమణ తెలంగాణలో 20 సీట్లు గెలుస్తామని అంటున్నాడని...ముందు ఆయన సీటుకే దిక్కులేదని విమర్శించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios