తెలంగాణ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రికేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ద్వారా గెలవాలని ప్రయత్నించినట్లే ఈసారి రూ.500 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ ను తెలంగాణలో చంద్రబాబు దింపారన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చుపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రికేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ద్వారా గెలవాలని ప్రయత్నించినట్లే ఈసారి రూ.500 కోట్లు ఖర్చుపెట్టాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీ ఇంటెలిజెన్స్ ను తెలంగాణలో చంద్రబాబు దింపారన్నారు. 

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, టీడీపీ నేతలు సీఎం రమేష్, బీద మస్తాన్ రావులపై ఐటీ దాడులు జరిగితే సీఎం చంద్రబాబు స్పందించడమేంటని ప్రశ్నించారు. ఐటీ దాడులు జరగడం సహజమేనని తెలిపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ ఎన్నికలు ఎదుర్కోలేదని అందువల్లే బలమెంతో తెలియదన్నారు. జేఏసీలో ఉన్నప్పుడు కోదండ రామ్ ను ఎంతో గౌరవించామని అయితే ఇప్పుడు కాంగ్రెస్ అవమానిస్తోందన్నారు. ఒకప్పుడు కోదండరామ్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. 

మరోవైపు దసరా తర్వాత టీఆర్‌ఎన్‌ మేనిఫెస్టో ప్రకటిస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఏకకాలంలో రుణమాఫీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని అలాగే నిరుద్యోగ భృతిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉండటం సర్వసాధారణమంటూ కేటీఆర్ కొట్టిపారేశారు.