తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో కొలువైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి ప్రారంంభంకానున్నారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఇలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. 

సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కొప్పుల ఈశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ పాలకమండలి తరపున బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను ముఖ్యమంత్రికి అందించారు.   
  
ధర్మపురిలో ఈ నెల 17నుండి 29వ తేదీ వరకు జరిగే లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు. ఇలా భక్తులు తమ మొక్కులను తీర్చుకుని స్వామివారి అనుగ్రహం పొందుతుంటారు. దీంతో భక్తులతో కిటకిటలాడుతూ ఏటా ఈ నెలలో ధర్మపురి జనసంద్రంగా మారుతుంది.