ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఓ చిన్నారిపై మంత్రి కొప్పుల ఈశ్వర్ కరుణ కురిపించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి అక్షయకు మంత్రి కొప్పులఈశ్వర్ ఆపన్న హస్తమందించారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన అక్షయ హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. 

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్ చేసి అక్షయకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. మంత్రి సహృదయంతో చిన్నారి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు.

మరింత మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 4లక్షల రూపాయల చెక్కును కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో అక్షయ తండ్రి లక్ష్మీ నారాయణకు మంత్రి అందజేశారు.