మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ను వీడటంపై స్పందించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను బయటకొచ్చి మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈటల ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కొప్పుల సూచించారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ టీఆర్ఎస్‌ను వీడటంపై స్పందించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను బయటకొచ్చి మాట్లాడటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఈటల ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కొప్పుల సూచించారు. కేబినెట్ నిర్ణయాలు నచ్చకపోతే మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేయాలని ఈశ్వర్ తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మీకు ఇంటర్నల్‌గా మాట్లాడే అవకాశం వున్నా.. అక్కడ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడటం సరికాదని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఐదేళ్ల నుంచి అసంతృప్తితో వుంటే ఇన్నాళ్లూ ఎందుకు కొనసాగారని మండిపడ్డారు. పార్టీలో ఉంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్యలు ఐదేళ్ల నుంచి ఎందుకు చేశారని కొప్పుల నిలదీశారు. దమ్ముంటే అసైన్డ్, దేవాదాయ భూముల్ని రిటర్న్ చేసి మాట్లాడాలని.. దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ కులాలకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని కొప్పుల స్పష్టం చేశారు. 

అటు మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పార్టీలో ఉన్నన్ని రోజులు బీసీలు, దళితులు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఆస్తుల రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని గంగుల ఆరోపించారు. హుజురాబాద్‌లో బలంగా వున్నది టీఆర్ఎస్.. ఈటల కాదని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు హుజురాబాద్‌లో ఈటల దళిత బాధితుల సంఘం ఏర్పాటు చేశారు. అక్రమ కేసులు, పీడీ యాక్ట్ కేసుల బారినపడిన 17 కుటుంబాలు సమావేశమయ్యాయి. 

Also Read:నాకే కాదు హరీష్ రావుకు కూడ టీఆర్ఎస్‌లో అవమానాలు: ఈటల రాజేందర్

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు రేపు ఆయన అందించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నకల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి వరుసగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాఢించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2018లలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు.