పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీవాళ్లే నమ్మడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 2014కు ముందు జరిగిన పరిణామాలే పునరావృతమవుతాయని స్పష్టం చేశారు.
సూర్యాపేట: పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీవాళ్లే నమ్మడం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 2014కు ముందు జరిగిన పరిణామాలే పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. ఉత్తమ్ ని ఎవరూ నమ్మడం లేదని, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఏం చెప్తారో ఎవరికీ అర్థం కాదంటూ ఎద్దేవా చేశారు.
మనపై ఢిల్లీ పెత్తనమేంటి తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడుకోవాలి అంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పురుడు పోసుకున్న టీడీపీ ఇప్పుడు వారితోనే అంటకాగడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బందీ అయిందని ఆరోపించారు.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేస్తే 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ వద్దని అగ్రిమెంట్ చేసుకున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు.
