Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి బ్రదర్స్ జోకర్లే కాదు పెద్ద బ్రోకర్లు కూడా: జగదీశ్ రెడ్డి

కోమటి రెడ్డి బ్రదర్స్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకోడానికి సిద్దంగా లేమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వారి వంటి జోకర్లను, పెద్ద బ్రోకర్లను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని ఘాటుగా స్పందించారు. గత కొంత కాలంగా వారు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నాయకులే వారిని పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

minister jagadish reddy fires on komatireddy brothers
Author
Nalgonda, First Published Aug 13, 2018, 4:01 PM IST

కోమటి రెడ్డి బ్రదర్స్ వంటి నాయకులను తమ పార్టీలో చేర్చుకోడానికి సిద్దంగా లేమని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వారి వంటి జోకర్లను, పెద్ద బ్రోకర్లను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే అవకాశమే లేదని ఘాటుగా స్పందించారు. గత కొంత కాలంగా వారు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నాయకులే వారిని పిచ్చాసుపత్రికి తరలించి చికిత్స చేయించాలని సూచించారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరతాడని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, పార్టీ మారుతున్నానని చేస్తున్న ప్రచారాన్ని కోమటిరెడ్డి నిన్న ఖండించారు. తాను టీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్తున్నట్టు  వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. కోమటిరెడ్డి ఇలా పార్టీ మారనని ప్రకటించిన మరుసటి రోజే అదే జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి ఇలా ఘాటుగా స్పందించడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి స్పందిస్తూ... ఈ పర్యటన వల్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు.తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, నాయకులను ఎప్పుడో మరిచిపోయారన్నారు. రాహుల్ కి ఇన్నాళ్లు కనిపించని తెలంగాణ ఎన్నికలు దగ్గరపడేసరికి గుర్తొచ్చిందా అంటూ మంత్రి ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా వందల మంది విద్యార్థుల ప్రాణాలను బలితీసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఎంత మొసలి కన్నీరు కార్చినా విద్యార్థి బిడ్డలు తిరిగిరారని అన్నారు. వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారని అన్నారు. రాహుల్ పర్యటనకు అందువల్లే ప్రజలు కూడా రావడం లేదని అయినా ఆయన ఏం మొహం పెట్టుకుని పర్యటన కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ విమర్శించారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios