Minister Jagadish Reddy: మల్లన్న సాగర్ నిర్మాణం తో తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగిందనీ, నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
Minister Jagadish Reddy: తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ చూసిన నీళ్ల గురించే మాట్లాడుతున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చాక నీటి సమస్య తీరిందని అన్నారు. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడ్డారని, మల్లన్న సాగర్ నిర్మాణం తో తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగిందని ప్రశసించారు. ఈ రోజు మూసి నది ఒడ్డున ఉన్నాం.. కానీ మూసి నది ఆనవాళ్లు కనబడటం లేదని అన్నారు. దేశంలో మురుగు నీరు తాగిన ఏకైక పట్టణము సుర్యాపేటనేననీ, దేశంలో నీళ్లు కొనుక్కుని తాగిన ఏకైక పట్టణం కూడా సూర్యాపేట పట్టణమే అన్నారు.
కానీ తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిందని, సీఎం కేసీఆర్ తెలంగాణలో అధికారం చేపట్టిన తరువాత.. మిషన్ భగీరథ కార్యక్రమంతో సూర్యపేట బాధలు పోయాయని తెలిపారు. ఇప్పుడు అలాంటి సమస్య లేదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందుతున్నాయనీ అన్నారు. తెలంగాణలో నీళ్లను సెంటిమెంట్ గా చూస్తున్నమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నీళ్లే ప్రాణం,నీళ్లు లేనిదే ప్రాణి లేదనీ, నీళ్లు ఉన్న భూమి పై మాత్రమే ప్రాణి మనగడ సాగిస్తోందని అన్నారు.
2014 ముందు..నల్గొండ జిల్లా లో ప్లోరోసిస్ తో ఉండే దాదాపు 2 లక్షల మంది ప్లోరోసిస్ వ్యాధి బారిన పడ్డారనీ, తెలంగాణ వచ్చాక ప్లోరోసిస్ పై సీఎం కేసీఆర్ ఆలోచన చేసి విజయం సాధించారని అన్నారు. గత సంవత్సరం నుండి ఒక్క ప్లోరోసిస్ కేస్ కూడా నమోదు కాలేదని తెలిపారు. నల్లొంగ ప్రధానంగా వ్యవసాయ రంగం పై ఆధారపడి ఉంటుందనీ, దేశంలోనే అత్యధిక వరి పండించిన పాంత్రం కూడా నల్గొండనేనని అన్నారు. సీఎం కేసీఆర్ విజన్ ప్రకారం .. వానలు వాపసు రావాలి కోతులు అడవులకు పోవాలి.. ఇలా కావాలంటే.. విస్తృతంగా చెట్లను పెంచుకోవాలని అన్నారు.
ఇప్పుడూ రాష్ట్రంలో ఏ రహదారి వెంట చూసినా.. ఇరువైపులా పచ్చని చెట్లు కనిపిస్తాయని తెలిపారు. మన మానవజాతి వల్లనే ప్రకృతి నాశనం అవుతుందని.. సీఎం కేసీఆర్ నదుల సంరక్షణకు పాటు పడ్డారని కీర్తించారు. మల్లన్న సాగర్ నిర్మాణం తో తెలంగాణ లో సాగు విస్తీర్ణం పెరిగిందనీ, నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
