Asianet News TeluguAsianet News Telugu

కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలు.. విడుదల చేసిన హరీష్ రావు (వీడియో)

కూడవెల్లి వాగు కొత్త దశ,దిశా చూపి పునర్జన్మ ను ప్రసాదించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

minister harishrao releases godavari water to Kudavelly Vagu - bsb
Author
Hyderabad, First Published Mar 23, 2021, 12:39 PM IST

కూడవెల్లి వాగు కొత్త దశ,దిశా చూపి పునర్జన్మ ను ప్రసాదించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 

"

కాళేశ్వరం ప్రాజెక్ట్ తో గుక్కెడు మంచి నీళ్ళ కోసం తల్లడిల్లిన ప్రాంతం ఇప్పుడు మండు టెండల్లో జలకళను సంతరించుకుందన్నారు. 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తుకు గోదారమ్మను తీసుకువచ్చి కూడవెల్లి వాగుకు జీవ జలకళ తెచ్చామని తెలిపారు.

కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదల తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి దగిన రోజని హర్షం వ్యక్తం చేశారు. కూడవెల్లి వాగులో గోదావరి జలాల విడుదలతో వెయ్యి ఓల్ట్ ల బల్బు వేస్తే వచ్చే వెలుగు రైతుల కళ్ళలో కనబడుతుందన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించిన రోజు హేళన చేసిన వ్యక్తులు ప్రస్తుత ఫలితాలు చూసి ఈర్ష్య పడుతున్నారని ఎద్దేవా చేశారు. కూడవెల్లి వాగు లో గోదావరి జలాల విడుదలతో వేసవి కాలంలో లక్షల రూపాయల విలువైన పంటను కాపాడు కోగలిగామన్నారు.

తెలంగాణ రైతుల మొఖాలు మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తో వర్షం కోసం ఎదురు చూపులు చూసే పరిస్థితి లేకుండా చేశామని స్వరాష్ట్రం సాధించుకున్నందువల్లే ... సాగు, త్రాగునీటి బాధలకు శాశ్వత పరిష్కారం చూపగలిగామని తెలిపారు.  ప్రతి పక్షాల విమర్శలకు మా పని తీరుతోనే సమాధానం చెబుతున్నామని చెప్పుకొచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios