Asianet News TeluguAsianet News Telugu

స్వరాష్ట్రం కోసం ఆనాడు టీఆర్ఎస్... ఉజ్వల భారత్ కోసం ఈనాడు బిఆర్ఎస్ :హరీష్ రావు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. 

Minister Harish Rao wishes on BRS Formation day AKP
Author
First Published Apr 27, 2023, 12:58 PM IST

హైదరాబాద్ : ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా మారి జాతీయ రాజకీయాలకు సిద్దమయ్యింది.ఇలా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బిఆర్ఎస్ పార్టీ 22 వసంతాలను పూర్తిచేసుకుని 23వ వసంతంలోకి అడుగుపెట్టింది.ఈ సందర్భంగా ఆవిర్భావ వేడులకలను ఆ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేసారు. 

''స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.! ఉజ్వల భారత్‌ కోసం నేడు బీఆర్‌ఎస్‌... కేసీఆర్ గారి సారథ్యంలో 22ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉద్యమ పార్టీ, స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసింది. అనతి కాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి, దేశానికే రోల్ మోడల్ అయ్యింది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది'' అని హరీష్ కొనియాడారు. 

''9 ఏళ్లలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మోడల్ ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు. దేశ అభివృద్ధి కోసం  తలపెట్టిన మహాయజ్ఞం జాతీయ స్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలి. బిఆర్ఎస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని 'గులాబీ' అభిమానులకు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు'' అంటూ హరీష్ ట్వీట్ చేసారు. 

Read More  23వ వసంతంలోకి ఉద్యమపార్టీ.. ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్‌ ట్వీట్..

ఇక సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  కేసీఆర్ నాయకత్వంలో కేవలం పిడికెడు మందితో ఉద్యమ పార్టీ  ప్రారంభమయ్యిందని అన్నారు. స్వరాష్ట్రం కోసం పోరాటంసాగించి చివరకు తెలంగాణను సాధించుకున్నాం... గత తొమ్మిదేళ్లుగా సుపరిపాలన అందిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిందన్నారు. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు కవిత పేర్కొన్నారు. 

తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనాడు..భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు అంటూ కవిత ట్వీట్‌ చేశారు. ఇలా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కూడా సక్సెస్ అవుతారంటూ కవిత పేర్కొన్నారు. 

ఇదిలావుంటే తెలంగాణ భవన్ లో జరిగిన బిఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు, ముఖ్య నాయకులతో కలిసి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు కేసీఆర్. అనంతరం కార్యాలయంలో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ అంశాలపై తీర్మానాలు చేయనున్నట్టు సమాచారం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios