విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్న మంత్రి హరీష్ రావు.. బీఆర్ఎస్ లోకి ఆహ్వానం..

దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరనున్నారు. నేడు మంత్రి హరీష్ రావు ఆయన నివాసానికి వెళ్లి ఆహ్వానించనున్నారు. 

Minister Harish Rao will go to Vishnuvardhan Reddy's residence, Invitation to BRS, hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన తరువాత రాష్ట్రంలో జంపింగ్ జపాంగ్ లు ఎక్కువైపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లోకి…  వలసలు పెరిగిపోతున్నాయి. అభ్యర్థుల జాబితాలు విడుదల చేసిన తర్వాత భంగపడిన ఆశావహులు.. ఇతర పార్టీల వైపు చూస్తుండడంతో ఈ  పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా  మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే,  దివంగత పిజెఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి  బీఆర్ఎస్ లో  చేరేందుకు సిద్ధమయ్యారు.

విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించగా.. ఆ టికెట్ను క్రికెటర్ అజారుద్దీన్ కి కేటాయించడంతో మనస్థాపానికి గురయ్యాడు.  కాంగ్రెస్కు రాజీనామా చేశారు. అనుచరులతో సమావేశమైన అనంతరం, వారి సూచన మేరకు ప్రస్తుతం బీఆర్ఎస్ లో చేరనున్నారు. నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్నలు సైతం బిఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు మంత్రి హరీష్ రావు దోమలగూడలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. విష్ణువర్థన్ రెడ్డితో చర్చించనున్నారు. 

సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డిని బిఆర్ఎస్ లోకి హరీష్ రావు ఆహ్వానించనున్నారు. ఆదివారం నాడు విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వీరిద్దరి మధ్య బీహార్ఎస్ లో చేరే విషయం చర్చకు వచ్చినట్లుగా సమాచారం. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడం ఖాయం అయింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios