Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్లో కీలక రంగాలకు ప్రాధాన్యం : అసెంబ్లీలో హరీష్ రావు తొలి పద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు.

Minister Harish rao to be Introduced Telangana Budget 2020 - 21 in Assembly on march 8
Author
Hyderabad, First Published Mar 8, 2020, 8:32 AM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకొన్న ఆర్ధిక మాంధ్యంతో పాటు కేంద్రం నుండి రాష్ట్రానికి పలు రంగాల్లో కేటాయింపుల్లో కోతలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌కు సర్కార్ రూపొందించింది. శనివారం నాడు  రాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

గత ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంచనాల కంటే 8 శాతం పెరుగుదలతో ఈ ఏడాది బడ్జెట్ అంచనాలను రూపొందించినట్టు తెలుస్తోంది. 2020-21 వార్షిక బడ్జెట్ ను  రానున్న రోజుల్లో ఆర్ధిక స్థితిగతులకు అనుగుణంగా రూపొందించారు. ప్రపంచాన్ని ఇప్పటికే ఆర్ధిక మాంధ్యం దెబ్బతీసింది. మరో వైపు కరోనా వైరస్ ప్రభావం కూడ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తోంది.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ బడ్జెట్ కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. గత ఏడాది రూ. 1.46 లక్షల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది మరో రూ. 12 వేల కోట్లు కలిపి రూ. 1.58 లక్షల కోట్లకు బడ్జెట్ అంచనాలు రూపొందించారని సమాచారం.

ఆర్ధిక శాఖమంత్రిగా హరీష్ రావు బాధ్యతలు స్వీకరించారు. గత టర్మ్ లో హరీష్ రావు నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్నారు. ఈ దఫా ఆయన ఆర్ధిక మంత్రిగా బాధ్యతలుు స్వీకరించారు. ఆర్ధిక శాఖ మంత్రిగా హరీష్ రావు తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ ను  ఇవాళ ప్రవేశపెట్టనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగాలపై అధికంగా నిధులను కేటాయిస్తోంది. ఈ రెండు రంగాలకు గతంలో కేటాయిస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడ నిధులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఈ బడ్జెట్ లో ఎక్కువ నిదులను కేటాయించే ఛాన్స్ లేకపోలేదు.రాష్ట్రంలో నీటి పారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు పెడుతోంది.

పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులను మరిన్ని ఖర్చు చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖకు కూడ నిధులు కేటాయించే అవకాశం లేకపోలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios