ఆంధ్రప్రదేశ్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చల్లారకముందే.. మరో తెలంగాణ మంత్రి హరీశ్ రావు సైతం ఏపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో ఆరు గంటల పాటు కరెంట్ పోతోందని.. తెలంగాణలో రెప్ప పాటు కూడా పవర్ కట్ లేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.  


ఇటీవల ఏపీలో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ టీఆర్ఎస్ నేత (trs) , మంత్రి కేటీఆర్ (ktr) చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది. వివాదం పెద్దదవుతుండటంతో మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. ఇది సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో మరో మంత్రి హరీశ్ రావు (harish rao) ఏపీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఆరు గంట‌ల పాటు క‌రెంట్ కోత‌లున్నాయ‌న్న (power cuts in ap) ఆయ‌న‌.. తెలంగాణ‌లో రెప్ప‌పాటు సేపు కూడా పవర్ క‌ట్ అన్న‌దే లేదంటూ కామెంట్స్ చేశారు.

మంగ‌ళ‌వారం మ‌హ‌బూబాబాద్‌ జిల్లాలో (mahabubabad) ప‌ర్య‌టించిన హరీశ్ రావు .. ఏపీలో క‌రెంట్ కోత‌ల‌పై మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 70 ఏళ్ల‌లో కాని ప‌నులు ఏడేళ్ల‌లో మీ అనుభ‌వంలో ఉన్నాయని చెప్పారు. క‌నురెప్ప కొట్టినంత సేపు కూడా క‌రెంట్ పోకుండా తెలంగాణ‌లో 24 గంట‌ల పాటు విద్యుత్ వ‌స్త‌ుందని అనుకున్నామా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేసీఆర్ (kcr) వ‌ల్ల‌ అది సాధ్య‌మైందని.... ప‌క్క‌న వున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజూ ఆరు గంట‌ల పాటు క‌రెంట్ క‌ట్ అవుతోందన్నారు. ఉదయం 3 గంట‌లు, సాయంత్రం 3 గంట‌లు క‌రెంట్ పోతోందని హరీశ్ పేర్కొన్నారు. ఇటు ప‌క్క‌న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ రోజూ ఆరు గంట‌ల క‌రెంట్ కోత అమలవుతోందని మంత్రి చెప్పారు. దేశం మొత్తం క‌రెంట్ కోత‌లున్న‌ాయని.. పవర్ కట్ లేకుండా 24 గంట‌ల పాటు విద్యుత్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణయేనని హరీశ్ రావు పేర్కొన్నారు. 

బీజేపీ (bjp) అంటే భారతీయ జుటా పార్టీ అని, అబద్ధాలు చెప్పడంతో ఆ పార్టీ నేతలకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా సరిపోదంటూ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ అని.. తమను ఎదుర్కొనే ధైర్యం లేకే రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని హరీశ్ రావు మండిపడ్డారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా ప్రధాన ఆస్పత్రి నూతన భవనానికి, రు. 510 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి మంత్రి హరీశ్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. 

కాగా.. ఇటీవల Hyderabadలో జరిగిన క్రెడాయి 11వ వార్షికోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో Roads ధ్వంసమయ్యాయని చెప్పారు. Electricity , Drinking Water కూడా లేవని తనకు కొందరు మిత్రులు చెప్పారన్నారు. అనుమానం ఉంటే ఎవరైనా పక్క రాష్ట్రానికి కార్లేసుకొని వెళ్లి రావాలని కేటీఆర్ సూచించారు. పక్క రాష్ట్రానికి పోయి వచ్చిన తర్వాతే మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంత బాగున్నాయో తెలుస్తుందని కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే రోడ్లు, మౌళిక సదుపాయాల కల్పన అద్భుతంగా ఉందన్నారు. నేను చెప్పేది అతిశయోక్తి కాదన్నారు. 

ఇతర రాష్ట్రాలో పోలిస్తే తెలంగాణలో రోడ్లు, మౌళిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. ఆయా రాష్ట్రాల్లో మన వాళ్లు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీ, ప్రతిపక్షాలకు లంచాలు ఇస్తేనే అనుమతులు వస్తాయని కేటీఆర్ ఆరోపించారు.పరిశ్రమలకు ెపారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు వస్తాయని మంత్రి కేటీఆర్ వివరించారు. 

అప్పుల తెలంగాణ అని కొందరు అంటున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. కేసీఆర్ అప్పు చేసి నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తు తరాల మీద పెట్టేది పెట్టుబడి అవుతుందనికేటీఆర్ చెప్పారు.111 జీవో ఎత్తివేస్తే ఏదేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.ఈ జీవోను నా కోసమే ఎత్తివేశారని ప్రచారాన్ని మంత్రి తప్పుబట్టారు.